09-12-2025 09:07:32 PM
ఆలయ ఈఓ : రమాదేవి
వేములవాడ (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ భీమేశ్వరాలయం 14 రోజుల హుండీ లెక్కింపును మంగళవారం ఆలయ అధికారులు పూర్తిచేశారు. ఈ కాలంలో భక్తులు సమర్పించిన హుండీ దానాల ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం చేరింది. మొత్తం హుండీ ఆదాయం: రూ 1,29,27,470 అభరణాల రూపంలో అందిన దానాలు: మిశ్రమ బంగారం: 60 గ్రాముల, 500 మిల్లీగ్రాములు మిశ్రమ వెండి: 3 కిలోల 800 గ్రాములు సమకూరినట్లు ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. హుండీ లెక్కింపులో దేవస్థానం ఈఓ రమాదేవితో పాటుగా, పరిశీలకుడు రాజమౌళి, ఏఈఓలు, పర్యవేక్షకులు, అర్చకులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా బాధ్యతలను ఎస్పీఎఫ్, హోమ్ గార్డులు చేపట్టగా, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో సహకరించారు.