29 July, 2026 | 8:07 PM

Breaking News

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు విఫలం   •   విధుల్లో ఉండగానే కార్మికుడి మృత్యువాత...   •   హైవేపై ఉన్న షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి   •   బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •  

అంబేడ్కర్ సేన రాష్ట్ర కార్యవర్గంలో కుపిర్యాల రాంచందర్‌ కు కీలక బాధ్యతలు

29-07-2026 07:12 PM

బోధన్,(విజయక్రాంతి): అంబేడ్కర్ సేన వరల్డ్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన కుపిర్యాల రాంచందర్‌ కు కీలక బాధ్యతలు హైదరాబాద్ లో బుధవారం రోజున  మధ్యాహ్నం అప్పగించారు. ఎరాజ్‌పల్లి గ్రామానికి చెందిన కుపిర్యాల రాంచందర్‌ను సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, అలాగే నిజామాబాద్ జిల్లా కన్వీనర్ & సోషల్ మీడియా ఇన్‌చార్జ్గా నియమిస్తూ అంబేడ్కర్ సేన అఖిల భారత కార్యదర్శి రెడ్డిమల్ల శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకం 2026 జూలై 28 నుంచి అమలులోకి వస్తుందని, ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంస్థ సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ, సభ్యత్వ విస్తరణ, సామాజిక సేవా కార్యక్రమాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణతో పాటు సంస్థ కార్యకలాపాలను జిల్లాలో మరింత బలోపేతం చేయాలని రామ్‌చందర్‌కు సూచించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన అంబేడ్కర్ సేన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కుపిర్యాల రామ్‌చందర్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.