23 June, 2026 | 11:07 AM

Breaking News

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ   •   ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •  

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రెండో రోజు కురియన్ కమిటీ ఆరా

12-07-2024 11:41 AM

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రెండో రోజు కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. గాంధీభవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, అభ్యర్థులతో కురియన్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ లోక్‌సభ స్థానాలకుగాను.. 14 సీట్ల వరకు గెలుస్తామని పెట్టుకున్న అంచనా తప్పి 8 స్థానాలకే పరిమితం కావడానికి గల కార ణాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రీమెన్ కమిటీ గురువారం గాంధీభవన్‌లో శుక్రవారం రోజు ఎంపీలు, ఎన్నికల్లో ఓడిన ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది.