21 August, 2026 | 2:24 PM

కొచ్చి చేరుకున్న కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు

14-06-2024 11:53 AM

కేరళ: కువైట్ భవనం అగ్నిప్రమాదంలో మరణించిన 46 మంది భారతీయుల మృతదేహాలతో వస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బాధితుల మృతదేహాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో సహా వారి స్వస్థలాలకు తరలిస్తారు. అనంతరం ఇతర రాష్ట్రాల బాధితుల మృతదేహాలతో విమానం ఢిల్లీకి బయలుదేరుతుంది. ఈ నెల 12న కువైట్ సిటీకి దక్షిణాన ఉన్న మంగాఫ్‌లో 196 మంది వలస కార్మికులు ఉన్న భవనంలో బుధవారం రాత్రి జరిగిన పేలుడులో దాదాపు 50 మంది గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో 49 మంది కార్మికులు మృతిచెందారు.మృతుల్లో 24 మంది కేరళ, ఏడుగురు తమిళనాడు వాసులున్నారు. మృతుల్లో ముగ్గురు తెలుగు ప్రజలు, మిగిలినవారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించగా, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి.