కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
14-06-2024 11:02 AM
అమరావతి: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెండు లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఘటనాస్థలిలో ఐదుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు కోనసీమ జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించామని మచిలీపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సుభానీ తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.






