21 August, 2026 | 2:59 PM

ఓడ్లకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్

21-08-2026 02:15 PM

బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఓడ్ల మహేందర్ తమ్ముడు ఓడ్ల కృష్ణ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ బీఆర్‌ఎస్‌ నాయకులు మోరీలు శ్రీనివాస్, అంజిరెడ్డి శుక్రవారం మైలారం గ్రామంలోని ఓడ్ల మహేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఓడ్ల కృష్ణ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ విషాద సమయంలో పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్‌ నాయకులు గోడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకట్ సార్, గంపల శంకర్, రమేష్, రాము, రాజు, బాబు, కృష్ణ, శ్రీనివాస్, మోహిసిన్, అక్తర్, సాయికుమార్, భాస్కర్, సాయిలు, గంగారం, దశరథ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.