దళిత బందు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): మంగళవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హనుమకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం రాంనగర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్న కాలంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న దళితులందరికీ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని కమలాపూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వాగ్దానంగా రాష్ట్రవ్యాప్తంగా దళితుల అభివృద్ధి కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహకారం టాక్సీ నడుపుకోవడం కోసం విలువైన ఫోర్ వీలర్ వాహనం లను మంజూర్ చేయడం జరిగింది.
కొంతమంది లబ్ధిదారులకు పాడి పరిశ్రమ అతి తక్కువ ఖర్చు అయిన వెహికల్ ని రెండు దఫాలుగా ఆర్థిక సహకారం చేస్తామని బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయకుండానే అసెంబ్లీ ఎన్నికల్లోకి వెళ్లడం జరిగింది. నియోజకవర్గానికి 2000 మందిని లబ్ధిదారుల ఎంపిక అని చెప్పి 100 మంది కి మాత్రమే పరిమితం చేసి పథకాన్ని అప్పటివరకు మిగతా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సిన డబ్బులను కూడా జమ చేయలేదు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా దళిత బంధు పథకాన్ని పేరు మార్చి అంబేద్కర్ అభయయాస్తం పేరుతో చేవెళ్ల డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షల రూపాయలని ఆర్థికంగా సహకారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
కానీ ఇప్పటికీ రాష్ట్రంలో దళితులందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించిన దాఖలు లేకపోగా కొత్తగా వారు అనుకున్న నిబంధనల ప్రకారం వాగ్దానాల ప్రకారం కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహకారాన్ని అందించే నిధులను నిలిపివేయడం అలాగే రాజీవ్ యువకిరణాల పేరుతో ఆర్థిక సహకారాన్ని అందిస్తామన్న ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్న సివిల్ స్కోర్ పేరుతో ఇప్పటివరకు ఒక లబ్ధిదారులు కూడా ఆర్థిక సహకారన అందించిన పరిస్థితి లేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పటికీ గత 2014 టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ముందునుంచి,
ఇప్పటివరకు కార్పొరేషన్ ఆర్థిక సహకారాన్ని అందించిన పరిస్థితి లేకపోవడం అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో చేవెళ్ల డిక్లరేషన్ లో అంబేద్కర్ అభయహస్తాన్ 12 లక్షల రూపాయలు ఇస్తామని ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు చేయకపోవడం సరైనది కాదని వెంటనే దళితులందరికీ ఆర్థిక సహకార అందించే ప్రక్రియను మొదలుపెట్టాలని లేనియెడల సామాజిక సంఘాల అన్నింటిని కలుపుకొని ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు మేకల నరేష్, సిఐటియు జిల్లా నాయకులు కుక్కమూడి రవీందర్, చందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






