భక్తిశ్రద్ధలతో పూజలు చేయండి
03-09-2025 12:00 AM
పట్టణంలో వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి) : భక్తిశ్రద్ధలతో పూజలు చేసి శాంతియుతంగా నిమర్జనం వేడుకలను నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు మండపాలను సందర్శించి ఎంపీ డీకే. అరుణ ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వారం జిల్లా కేంద్రంలో కొత్త గంజిలోని నీలకంఠ మల్లికార్జున స్వామి ఆలయంలో, లక్ష్మీ నర్సింహ స్వామి టెంపుల్, బోయపల్లి, పద్మావతి కాలనీలలో కొలువుదీరిన గణనాధులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.






