3 August, 2026 | 11:17 AM

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

03-09-2025 12:00 AM

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్

ముషీరాబాద్,  సెప్టెంబర్ 2 (విజయక్రాంతి):  తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చి న హామీలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి హామీలను వెంటనే నెరవేర్చాలని  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, కో-కన్వీనర్ సుదర్శన్ యాదవ్, గ్రేటర్  హైదరాబాద్ కన్వీనర్ జగన్ యాదవ్ కోరారు.

తెలంగాణ ఉద్యమకారుడు గొల్లపల్లి నాగరాజ్ ఆర్ పి ఐ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మాలలు, శాలువాతో ఘనంగా సత్కరించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో  అధికారంలో ఉన్న భాగస్వామ్య పార్టీగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి అధవలే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోడీతో చర్చించి ఉద్యమకారులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఆర్పిఐ దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి నాగరాజు మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీతో చర్చించి ఉద్యమకారుల హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా  కృతజ్ఞతలు తెలియజేశారు.