calender_icon.png 21 May, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

21-05-2025 12:00:00 AM

  1. వామపక్షల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

మంచిర్యాల, మే 20 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంచిర్యాల బస్టాం డ్ ముందు వామ పక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఇఫ్టు జిల్లా అధ్య క్షు లు బ్రహ్మానందం, సీఐటీయూ జిల్లా నాయ కులు ప్రకాష్, టియుసిఐ నాయకులు దేవ రాజు మాట్లాడుతూ..

దేశంలో సంపద సృష్టికర్తలు కార్మికులని గుర్తు చేశారు. సహ జ వనరులను వెలికి తీసి వాటిని సంపదగా మార్చేది కార్మిక వర్గం మాత్రమేనని, అలాం టి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసే 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చ టం కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేయడమేనని, కేవలం కార్పొరేట్, వ్యాపార వర్గాలకు మాత్రమే ఇవి లాభదాయకమ న్నారు.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9న విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే విధానాలను కేంద్ర ప్రభు త్వం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు ఖలీందర్ ఆలీ ఖాన్, మిట్టపల్లి పౌలు, దొడ్డిపట్ల రవీందర్, రాయమల్లు, ఇఫ్టు నాయకులు శ్రీనివాస్, రాములు, ప్రభాకర్, సిఐటియు నాయకులు రవి, రాజేందర్, సందీప్, ఏఐఎఫ్‌టియు నాయ కులు పోషమల్లు పాల్గొన్నారు.