calender_icon.png 21 May, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40 టన్నుల పిడియస్ బియ్యం పట్టివేత: ఎస్సై వెంకట్ రెడ్డి

20-05-2025 10:41:42 PM

సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పోచాపూర్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా KA 56 7022 లారీ అనుమానస్పదంగా కనిపించడంతో అందులో పోలీసులు తనిఖీ చెయ్యగ బియ్యం బస్తాలు కనిపించగా వెంటనే విజిలెన్స్ & సివిల్ సప్లై అధికారులకు తెలుపడంతో వారు వచ్చి అందులో తనిఖీ చెయ్యగ 40 టన్నుల పిడియస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇట్టి లారీ కర్ణాటకలోని గురుమిత్కాల్ నుండి పిట్లం వెళ్తున్నట్టు తెలిసింది. వెంటనే అట్టి లారీపై సివిల్ సప్లై డీటీ సజీయుద్దీన్ ఇచ్చిన పిర్యాదు ఆధారంగా ఓనర్ జాకిర్ మియా, డ్రైవర్ అనిల్ కుమార్ పై కేసు నమోదు చేయ్యడం జరిగింది. డిఎస్పి విజిలేన్స్ వెంకటేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.