calender_icon.png 21 May, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతను దైవచిత్తనను కలిగి ఉండాలి

20-05-2025 10:45:10 PM

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్..

నాగారం: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను దైవచింతను కలిగి ఉండాలని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్(Former MLA Dr. Gadari Kishore Kumar) అన్నారు. మంగళవారం నాగారం మండలం ఈటూరు గ్రామంలో గ్రామస్తులంతా కలసి నిర్వహించిన బొడ్రాయి (నాభి శిల) ప్రతిష్ఠా వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామస్తులంతా కలసి మెలిసి బొడ్రాయి పండుగ నిర్వహించడం ఐకమత్యానికి నిదర్శనం అన్నారు.

గ్రామస్తులంతా పాడిపంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని అని, గ్రామదేవతల ఆశీర్వాదాలు గ్రామస్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే రజాక్ నాగారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కలేట్లపల్లి ఉప్పలయ్య బొడ్రాయి పండుగ కమిటీ సభ్యులు & మాజీ గ్రంథాలయ చైర్మన్ చిల్లర చంద్రమౌళి కొమ్మినేని సతీష్ తాటికొండ సీతయ్య సోమేశ్ గుండగాని అంబయ్య పొదిల రమేష్ మాజీ సర్పంచ్ పేరాల సరితయాదగిరి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొడిశాల యాదగిరి ఎల్లయ్య మల్లయ్య నరేష్ అంజయ్య మహేశ్ శ్రీనివాస్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.