కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5 (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తుందని, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కావాలని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5 ఇన్‌క్లున్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాన్‌రైడింగ్ సిస్టమ్‌ను సీఎండీ ప్రారంభించారు. ఈ సందర్బంగా భూగర్బ బావిలోకి మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా దిగి కార్మికులు పనిచేసే ప్రదేశాలను పరిశీలించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంవతో ఈ సిస్టం ప్రారంభించామని, అందుకు రూ 8.82 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కొత్తగూడెం ఏరియాలో పీకే 7 ఓపెన్‌కాస్ట్‌కు అనుమతి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎన్‌వీకే శ్రీనివాస్, సత్యనారాయణ, జనరల్ మేనేజర్ పాలెం రాజు, 5 ఇన్‌క్లున్ మేనేజర్ పాలడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






