మోదీతోనే దేశానికి రక్ష
06-06-2024 02:26 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రధాని మోదీ పాలనతోనే దేశానికి రక్ష అని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా బుధవారం ఆయన నివాసం వద్ద బీజేపీ నాయకులు సంబురాలు నిర్వహించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలన చూసి, ప్రజలు ఆ పార్టీని గెలిపిస్తున్నారన్నారు. సంబురాల్లో ఎమార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, నాయకులు సుంకరి పెంటు, ప్రసాద్ గౌడ్, సత్యనారాయణ, సంతోష్, రుకుం ప్రహ్లాద్, రవి, బాపు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






