calender_icon.png 18 June, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాటా గ్రూప్‌లో 5 లక్షల ఉద్యోగాలు

16-10-2024 12:26:12 AM

  1. తయారీ రంగంలో వచ్చే ఐదేండ్లలో నియమిస్తాం
  2. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: టాటా గ్రూప్ నిర్వహిస్తున్న వివిధ తయారీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు సిద్ధమయ్యింది. వ చ్చే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ వెల్లడించారు. మంగళవారం ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సదస్సులో చంద్రశేఖరన్ మాట్లాడుతూ తమ సెమికండక్టర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, బ్యా టరీ సంబంధిత రంగాల్లో భారీసంఖ్యలో ని యామకాలు జరుపుతామన్నారు.

‘సెమికండక్టర్స్‌లో మా (టాటా గ్రూప్) పెట్టుబడులు,  ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్, అసెంబ్లింగ్, ఎ లక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు సంబంధిత పరిశ్రమల్లో మా పెట్టుడుల ఫలితంగా వచ్చే ఐదేండ్లలో ఐదు లక్షల తయారీ రంగ ఉద్యోగాల్ని మేము కల్పించగలమని నేను భావిస్తు న్నా’ అని చంద్రశేఖరన్ వివరించారు.

త్వర లో అస్సాంలో టాటా గ్రూప్ నెలకొల్పనున్న సెమికండక్టర్ ప్లాంట్, ఎలక్ట్రిక్ వాహన, బ్యాటరీ తయారీ యూనిట్లను ఆయన ఉదహరిస్తూ  తాము పెద్ద సంఖ్యలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడు తన వద్ద సిద్ధంగా లేవని, తాము సృష్టించే ఉద్యోగాలతో ఇతర కంపెనీలు మరిన్ని ఉద్యోగాల్ని కల్పిస్తాయన్నారు.

టాటా గ్రూప్ స్థాపించే ప్లాంట్లతో దేశంలో కనీసం 5 లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొంటాయని, వాటి ద్వారా వ్యవస్థలో మరిన్ని నియామకాలు జరుగుతాయని టాటా సన్స్ చైర్మన్ అంచనా వేశారు. తయారీ రంగంలో ఉద్యోగ కల్పన జరగడానికి ప్రభుత్వం కూడా తన చర్యల ద్వారా మద్దతును ఇస్తున్నదని చెప్పారు. 

ఉద్యోగ కల్పన లేనిదే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేం

తయారీ రంగంలో ఉద్యోగాల్ని సృష్టించకపోతే భారత్ ధనిక దేశంగా అభివృద్ధి చెం దాలన్న లక్ష్యం సాధ్యపడదని టాటా సన్స్ చైర్మన్ స్పష్టం చేశారు. ‘తయారీ ఉద్యోగాల కల్పన జరగనిదే వికసిత్ భారత్ లక్ష్యాల్ని సా ధించలేం. ఎందుకంటే ఉద్యోగాల కోసం చూసేవారు ప్రతీ నెలా 10 లక్షల మంది వర్క్‌ఫోర్స్‌లో చేరుతున్నారనేది మనకు తెలుసు.

మనం 10 కోట్ల ఉద్యోగాల్ని సృష్టించాల్సిన అవసరం ఉన్నది’ అని టాటా సన్స్ చైర్మన్ చెప్పారు. సెమికండక్టర్స్ తరహా కొత్త తరం తయారీ రంగాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ రంగాల్లో సృష్టించే ప్రతీ ఒక్క ఉద్యో గానికి అదనంగా ఎనిమిది నుంచి పది పరో క్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.