12 March, 2026 | 12:27 PM

ఇంటర్ పరీక్షకు వెళ్తుండగా రోడ్డుప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

12-03-2026 10:51 AM

 మృతులు కొత్తూరు వాసులు 

 పెద్ద షాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 

షాద్‌నగర్,(విజయక్రాంతి): శంషాబాద్ లోని  ప్రైవేట్ కాలేజీలో పరీక్ష రాయడానికి షాద్ నగర్ నియోజకవర్గం(Shadnagar Constituency) కొత్తూరు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ పెద్ద శంషాబాద్ మండలం(Shamshabad Mandal) షాపూర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.