28 March, 2026 | 8:39 PM

లక్ష్మణ చందా సంత వేలం పాట

28-03-2026 06:54 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 2026-2027 సంవత్సరంకు గాను అంగడి వారసంత వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో 90 వేల రూపాయలకు విక్రమ్ సింగ్ రాథోడ్ వరసంతను తీసుకున్నారు. అనంతరం జిపి ఆధ్వర్యంలో విక్రమ్ సింగ్ రాథోడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓస కవిత రాజు, ఎంపీఓ నసీరుద్దీన్ ఉప సర్పంచ్ లక్కల వర్ష రవి పంచాయతీ కార్యదర్శి సుధాకర్. వార్డు సభ్యులు శ్రీనివాస్ ,అరటి రాజేశ్వర్ ,గుడ్ల సంధ్య రంజిత్ తదితరులు పాల్గొన్నారు.