28 March, 2026 | 8:49 PM

డయాలసిస్ సేవల పునరుద్ధరణకు చైర్మన్ చొరవ

28-03-2026 06:58 PM

- రూ.50 వేలు అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి

చేవెళ్ల,(విజయక్రాంతి): చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నూతన భవన నిర్మాణం వల్ల విద్యుత్ సరఫరకు అంతరాయమై గతకొన్ని రోజులుగా డయాలసిస్ సేవలు ఆగిపోయిన విషయం తెలిసిందె. చైర్మన్ సమత రెడ్డి శనివారం ఆసుపత్రికి వెల్లి రోగులతో మాట్లాడి వారి పడుతున్న కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 30 మంది పేషెంట్స్ డయాలసిస్ చేయించుకుంటున్నట్లు తెలిపారు.

సేవలు నిలిచిపోవడంతో పటాన్ చెరు డయాలసిస్ కేంద్రానికి ముగ్గురు, శంషాబాద్ 9, వికారాబాద్18 మందిని పంపారని పేషెంట్లు చైర్మన్ కు చెప్పారు. షాద్ నగర్ లో డయాలసిస్ చేయడం లేదని ఆరోపించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నెల రోజులుగా ఆర్ఎఫ్ఎ టెస్ట్ చేయడం లేదని, దీంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్కు వెల్లిన ప్రతీసారి రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని వాపోయారు. కొత్త పేషెంట్లకు డయాలసిస్ చేసేందుకు పిస్టులా అవసరమని, దీనికి సెఫ్రాలజిస్టు వైద్యం చేయాలని తెలిపారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 15-20 వేల బిల్ అయితుందని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. పటాన్ చెరు, శంషాబాద్, వికారాబాద్, డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. అక్కడి రోగులకు డయాలసిస్ చేశాకనే తమకు చేస్తున్నారని, రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేస్తే 12 కావడంతో ఇంటికి వచ్చే పరిస్థితి లేక అక్కడే రాత్రి అక్కడే ఉండాల్సి వస్తుందన్నారు.

సమస్య విన్న చైర్పర్సన్ వెంటనే ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజేంద్రప్రసాద్, డయాలసిస్ నిర్వహకులు సమీర్ కు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. ముందస్తుగా కరెంట్ కేబుల్ వైరు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే రూ.50 వేల నగదును అందించారు. రెండు రోజుల్లో పని పూర్తి చేసి సేవలను ప్రారంభిమాచాలని చెప్పారు. సమతా రెడ్డి వెంట సీఐ భూపాల్ శ్రీధర్, ఎస్సైలు శిరీష, తేజశ్రీ, బీజేపీ జిల్లా కార్యదర్శి కృష్ణాగౌడ్, కందాడ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తరులున్నారు.