15 April, 2026 | 10:40 AM

మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి

28-12-2025 12:00 AM

వరంగల్‌కు వచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటి అధికారులు

మహబూబాబాద్,డిసెంబర్27(విజయక్రాంతి): వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూసేకర ణ కార్యక్రమం పూర్తి చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూ సేక రణకు సంబంధించిన తుది అంకా న్ని పరిశీలించడానికి వరంగల్ నగరానికి వచ్చారు. ఇప్పటికే భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారుల ద్వారా భూ సేకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారికంగా నేడో రేపో ఏయి ర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు రాష్ట్ర ప్రభు త్వం అప్పజెప్పనుంది.

ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌భూమికి బౌండరీ ఏర్పా టు చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చా రు. ఇప్పటికే ఏయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాము నూరులో ఆధీనంలో ఉన్న 696.14 ఎకరాలకు అదనంగా 253 ఎకరాలు అవసర మని గుర్తించింది. ఇందు లో ప్రైవేటు వ్యక్తులు, రైతుల భూమి ఉండడంతో భూసేకరణ కార్యక్రమం మొద ట్లో ఇబ్బంది కరంగా మారింది. రైతులు, ఖాళీ స్థలాల యజమానులు ప్రతిపాదిత భూములను ఇవ్వడానికి ససేమిరా అన్నారు. 

తమకు పెద్దఎత్తున పరిహారం కావాలని డిమాండ్ చేస్తూ అనేకసార్లు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా మం త్రులు, అధికారులు చొరవచూపి వ్యవసాయ భూ ములకు ఎకరానికి కోటి 20 లక్షలు, ఖాళీ ఇండ్ల స్థలాలకు గజానికి రూ.4,888చొప్పునచెల్లించడానికిప్రభుత్వంఅంగీకరించింది. మేరకు భూనిర్వాసితులతో ఒప్పందానికి వచ్చింది. ఇందుకోసం రూ.295 కోట్లను ప రిహారం చెల్లించేందుకు విడుదల చేసింది. దీంతో భూసేకరణ అంకం ముగిసిపోయింది.