calender_icon.png 28 December, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య నేర్పిన గురువును మరువొద్దు

28-12-2025 12:00:00 AM

  1. ఆలివ్ స్వీట్స్ అకాడమిక్ ఎక్సలెన్సర్ అవార్డు ప్రదానం

ఆలివ్ మిఠాయి వ్యవస్థాపకుడు దొర రాజు

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

సికింద్రాబాద్, డిసెంబర్ 27 (విజయ్‌క్రాంతి) : విద్యార్థులు తాము చదువుకునే విద్యలో రాణించగలిగితే సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారని కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తల్లిదండ్రులు, చదువు చెప్పి న గురువులు ఎన్నటికీ మరవకూడదని సూచించారు. శనివారం కూకట్‌పల్లి కేపి. హెచ్.బి కాలనీలోని పీ ఎం ఆర్ ఎంపైర్ లో ‘ఆలివ్ స్వీట్స్ అకాడమిక్ ఎక్సలెన్సర్‘ అవా ర్డు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

అనంతరం మూసాపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో పదవ తరగతిలో 600 మార్కులకు గాను 579 మార్కు లు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్న జనం సోనియాను అభినందించి ఆలివ్ అకాడమిక్ ఎక్స్లెన్స్ అవార్డు తరఫున లక్ష రూపాయల చెక్కును సోనియాతో పాటు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా మిగతా 12 మంది విద్యార్థులకు పదివేల చొప్పున చెక్స్‌ను సంస్థ వ్యవస్థాపకుడు దొర రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలివ్ మిఠాయి దొర రాజు, బాలానగర్ ఎంఈఓ హరీష్ చంద్ర, కూకట్ పల్లి ఎంఈఓ వి.కిషన్ ,వరుణ్ ,రాధా, సింధు తదితరులు పాల్గొన్నారు.