calender_icon.png 28 December, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన వడ్డెరలు

28-12-2025 12:00:00 AM

ముషీరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): రాబోయే ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపల్ ఎన్నికల్లో వడ్డెర నాయకులు భారీ సంఖ్యలో విజయం సాధిస్తారని తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలు మల్లు తెలిపారు. తెలంగాణ వడ్డెర సంఘం చారిటీ బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలోని 31 జిల్లాల నుంచి నూతనంగా గెలుపొందిన 94 మంది సర్పంచులు 47 మంది ఉపసర్పంచులను శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలు మల్లు శాలువాతో ఘనంగా సత్కరించి సంఘం పురస్కారాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుప్పల వెంకటేష్, రాష్ట్ర వైస్ చైర్మన్ బోదాసు నరసింహ, కోశాధికారి గుర్రం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వరి కుప్పల శ్రీశైలం, మల్లేష్, శివరాత్రి బిక్షం, పల్లపు దుర్గయ్య, రాష్ట్ర కార్యదర్శులు సం పంగి రామకృష్ణ ,ఉపేందర్, ముద్దంగుల చెన్నయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.