అంజనాద్రి నగర్‌లో భూకబ్జా కలకలం
- 25 ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్లపై వివాదం
రూ.50 కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేశారని ఆరోపణలు
హైడ్రా అధికారుల పర్యటన.. రోడ్డు, ప్లాట్ల పరిశీలన
కోర్టు ఆదేశాలున్నా.. నిర్మాణాలు చేస్తున్నారని బాధితుల ఆగ్రహం
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 1: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగోల్ సర్కిల్, పెద్ద అంబర్పేట్ 52వ డివిజన్ కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న అంజనాద్రి నగర్లో భూ వివాదం తీవ్రతరమైంది. ప్లాట్లు, రోడ్డు కబ్జా ఆరోపణల నేపథ్యంలో బుధవారం హైడ్రా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం.. కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 204, 208లో ‘గడ్డం’ కుటుంబ సభ్యులు సుమారు 25 ఏళ్ల కిందట వాకిటి పుల్లారెడ్డికి జీపీఏ ఇవ్వగా, 1991లో లేఅవుట్ చేసి ప్లాట్లు విక్రయించినట్లు సమాచారం.
అప్ప ట్లో కొనుగోలు చేసిన ప్లాట్లను ప్రస్తుతం కొందరు రియల్ ఎస్టేట్ నిర్వాహకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ‘గురు కృష్ణ డెవలప్మెంట్’ పేరుతో ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ రాత్రికి రాత్రే ప్రహరీ నిర్మాణాలు చేపడుతోందని, తమ ప్లాట్లలోని రహదారులను కూడా ఆక్రమిస్తున్నారని అంజనాద్రి నగర్ ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు హైడ్రా ఏసీపీ నేతృత్వంలోని బృం దం కబ్జా జరిగిన రోడ్డు, ప్లాట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా ప్లాట్ యజమా నులు, డెవలపర్ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కబ్జాదారులు రెవెన్యూ అధికారుల అండతో ధరణి పోర్టల్ ద్వారా పాస్బుక్లు పొందుతూ, హెచ్‌ఎండీఏ అనుమతులతో నిర్మాణాలు చేపడుతున్నారని బాధి తులు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైడ్రా అధికారులు.. సంబంధిత పత్రాలతో తమ కార్యాలయానికి రావాలని సూచించారు.
ప్రభుత్వం స్పందించాలని బాధితుల విన్నపం..
అనంతరం ప్లాట్ యజమానులు మాట్లాడుతూ.. పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన తమ ఆస్తులను బలవంతంగా ఆక్రమిస్తున్నారని వాపోయారు. అధికార పార్టీ అం డతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ భూ వివా దం హైకోర్టులో పెండింగ్లో ఉండగా, ఎలాం టి నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా పను లు కొనసాగిస్తున్నారని వారు మండిపడ్డారు.
సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 40 ప్లాట్లు, రూ.50 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు కోసం కొనుగోలు చేసిన ప్లాట్లు కో ల్పోతామోనన్న భయంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చెరుకూ రి గోపీనాథ్, కోమటిరెడ్డి అమరేందర్ రెడ్డి, టి.రమేశ్, షబ్బీర్, రాజశేఖర్‌రెడ్డి, ఫణి కుమా ర్, విష్ణువర్ధన్ సింగ్, సునీత పాల్గొన్నారు.




