30 June, 2026 | 8:42 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

పెద్దపల్లి ఎంపీ, మంత్రి అండతో భూమి కబ్జా..

24-06-2025 07:58 PM

ప్రజావాణీలో ఫిర్యాదు చేసిన సోషల్​ వర్కర్​..

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(MP Vamsi Krishna), మంత్రి వివేక్​ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) అండదండలతో పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట మాజీ సర్పంచ్​ సయ్యద్​ సజ్జాద్, ​పెద్దపల్లి శివారులోని 1698 సర్వే నంబర్​లో 8 గుంటల భూమిని కబ్జా చేసాడని పెద్దపల్లికి చెందిన సోషల్​ వర్కర్​ ఎంఎ రహమాన్​(షాకీర్​) ప్రజావాణీలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశాడు. అలాగే రహమాన్​ సోషల్​ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. సయ్యద్​ సజ్జాద్​ అనే వ్యక్తి మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అనుచరుడుగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

పెద్దపల్లి శివారులోని 1698 సర్వే నంబర్​లో ఉన్న 8 గుంటల భూమి కబ్జా చేసి ఆ భూమిని వెంచర్​ చేసి తన అనుచరులతో కలిసి అమ్మకాలు చేస్తున్నాడు. అలాగే 1699 సర్వే నంబర్​లోని ప్రభుత్వ భూమిలో ఉన్న చెరువు నాలాను కూడా మట్టితో పూడ్చివేసి రోడ్డు వేసుకున్నాడని పేర్కొన్నాడు. తనకు ఎంపీ, మంత్రి అండదండలున్నాయనే, తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని రహమాన్​ తన వీడియోలో పేర్కొన్నాడు. అక్రమాలకు పాల్పడుతున్న సయ్యద్​ సజ్జాద్​పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరాడు.