30 June, 2026 | 9:50 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

భూగర్భ గనులతోనే మందమర్రి మనుగడ సాధ్యం

24-06-2025 07:54 PM

టిడిపి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్..

మందమర్రి (విజయక్రాంతి): భూగర్భగనుల ఏర్పాటుతోనే పట్టణ మనుగడ సాధ్యమవుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని శ్రావణపళ్లిలో భూగర్భగనులను వెంటనే ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్(TDP City President Vasala Sampath) డిమాండ్ చేశారు. పట్టణ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా పరిధిలో రెండు భూగర్భ గనులను శ్రావణపల్లిలో ఏర్పాటు చేయాలని కోరుతూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(Singareni Chairman and Managing Director)కు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

గతంలో ఏరియా పరిధిలో 8 బొగ్గు గనులు నడిచే సమయంలో 6000 మంది సింగరేణి కార్మికులు విధులు నిర్వహించగా వారిపై ఆధారపడి అనేక మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారని ఆయన గుర్తు చేశారు. సింగరేణి సంస్థ భూగర్భ గనులపై దృష్టి పెట్టక పోవడంతో, కేవలం 3 బొగ్గు గనులు ఉండడంతో వారిపై ఆధారపడి జీవించే వారికి, చేతి వృత్తుల వారికి ఉపాధి లేక హైదరాబాద్ కు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టణ ప్రజలు, రాజకీయ నాయకులు, కార్మిక, కుల సంఘాలు, వ్యాపారులు, మేధావులు, విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు నూతన బొగ్గు గనుల ఏర్పాటు కోసం జరిగే  పోరాటంలో తమ వంతు పాత్ర పోషించి బొగ్గు గనులు ప్రారంభించేలా సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పట్టణ పట్టణ మహిళా టిడిపి అధ్యక్షురాలు ఆర్ జయ సుకన్య, ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, సామ నాగేష్ రెడ్డి, సత్యనారాయణ, రంగనాథ్ చాట్లపల్లి రాజేష్, జ్యోతి, సామ కవిత, ముల్కల భాగ్యలక్ష్మి, భారతి, అరుణ, రమాదేవి, మమత, దేవి నరసమ్మ, సమ్మక్క, రమాదేవి లు పాల్గొన్నారు.