calender_icon.png 26 July, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఏమి చేశారని పార్టీ విజయోత్సవ సభలు..

24-06-2025 08:01:35 PM

బిఆర్ఎస్ నేత మానే రామకృష్ణ..

భద్రాచలం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది అని ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సంబరాలు చేస్తున్నారని భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు మానే రామకృష్ణ(Constituency BRS leader Mane Ramakrishna) తీవ్రంగా విమర్శించారు. ఈ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం, యొక్క బూటకం మాటలతో ప్రజలను మరోసారి మభ్య పెట్టడం కోసమని ఆయన అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతుబంధు పథకం 11 సార్లు 80 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు చెల్లించడం జరిగిందనీ, ఆనాడు కరోనా సమయంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ పెట్టి రాష్ట్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న కూడా రైతు బంధు పథకాన్ని ప్రతి సంవత్సరం రైతులకు డబ్బులు చెల్లించడం జరిగిందని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు రైతులకి బేడీలు వేసినందుకా, సన్న వడ్లకు బోనస్ ఇవ్వనందుకా, గత రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకా, రైతులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి 12 వేల రూపాయలకు కుదించి మాయ మాటలు చెప్పినందుకా ఈ విద్యుత్ సంబరాలు అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా రైతులకు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 60% మంది రైతులకు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని విద్యుత్ సంబరాలు చేస్తుందని తన తీవ్రంగా విమర్శించారు.