15 May, 2026 | 9:09 PM

జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు

15-05-2026 08:11 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బి.జి కొత్తూరు గ్రామ పరిధిలోని జవహర్ నవోదయ పాఠశాలకు సంబంధించిన భూమిని తహసీల్దార్ సూర్యప్రకాశ్ శుక్రవారం రైతులతో చర్చించి సరిహద్దులను ఖరారు చేసి అధికారులకు స్వాధీనం పరిచారు. భూమి హద్దుల విషయంలో స్థానిక రైతులతో మాట్లాడి పరస్పర అవగాహనతో ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొండికుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, సీతారామపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సపక పిచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, కాక రాములు, రెవెన్యూ అధికారులు, బి.జి కొత్తూరు గ్రామస్తులు పాల్గొన్నారు.