calender_icon.png 5 July, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి

04-07-2025 01:07:24 AM

  1. ప్రొఫెసర్ హరగోపాల్  

కుర్మిద్ద నుంచి మేడిపల్లి వరకు ఫార్మా రైతుల పాదయాత్ర

యాచారం జూలై  3: నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలనీ ప్రొఫెసర్ అరగోపాల్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో మండల పరి ధిలోని కుర్మిద్ద గ్రామం నుంచి మేడిపల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫార్మా వ్యతిరేక కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి, ప్రొఫెసర్ హరగోపాల్ పా ల్గొని మాట్లాడుతూ..

పర్యావరణానికి ముప్పు కలిగించే పరిశ్రమలను ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం కుంటు పడుతుందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమల పేరుతో రైతుల వద్ద  బలవంతంగా భూములను సేకరించి మోసం చేస్తే, తాము న్యాయం చేస్తామని హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ అదే బాటలో పయనిస్తోందని విమర్శించారు.

ఇప్పటికైనా 2500 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త బాబురావు, ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు కానమోని గణేశ్, బందే రాజశేఖర్రెడ్డి, మహిపాల్రెడ్డి, కుందారపు నారాయణ, వంగ సంజీవరెడ్డి తదితరులుపాల్గొన్నారు.