04-07-2025 01:06:15 AM
హైదరాబాద్, జులై 3 (విజయక్రాంతి): పీఆర్టీయూ టీఎస్ టీచర్ సంఘం క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా యాదాద్రి జిల్లాకు చెందిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు కోమటిరెడ్డి నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. ఈమేరకు టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర సంఘం అధ్యక్షులు గుండు లక్ష్మణ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు.
గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సంఘానికి క్రమశిక్షణ కమిటీ అత్యంత ప్రధానమైన విభాగమని, క్రమశిక్షణతో సంఘాన్ని నడపాలని, చైర్మన్‌గా బాధ్యతలను ఆదర్శంగా నిర్వహించాలని ఆయన అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా రాగ ద్వేశాలకు తావులేకుండా నిర్వర్తిస్తానని, తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డికి.. నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.