05-07-2025 11:00:47 AM
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు(Telangana BJP President) రామచందర్ రావు శనివారం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి(Bhagyalakshmi Temple) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామచందర్ రావు వెంట పలువురు బీజేపీ నాయకులు, పార్టీ నేతలున్నారు. అనంతరం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లిన రామచందర్ రావు(Ramchander Rao) అమరవీరులకు నివాళులర్పించారు. గన్ పార్క్ నుంచి రామచందర్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రామచందర్ రావు ర్యాలీగా వెళ్తారు. కాసేపట్లో ఎన్. రామచందర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.