calender_icon.png 5 July, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారును ఢీకొట్టిన లారీ.. 9 మందికి గాయాలు

05-07-2025 09:14:29 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లా(Nalgonda District) కట్టంగూరు మండలం పామునగుండ్ల వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాలను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట(Hyderabad Towards Suryapet) వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.