తేలి పోయిన బౌలర్లు
లంక ఎలెవన్ భారీ స్కోరు
చివర్లో రాణించిన స్పిన్నర్లు
తొలిరోజు లంక ఎలెవన్ 363/8
కొలంబో, ఆగస్టు 7: శ్రీలంక పర్యటన అంత ఈజీ కాదని వార్మప్ మ్యాచ్‌తోనే భా రత్‌కు అర్థమయింది. తొలి టెస్ట్ కంటే ముం దు లంక ఎలెవన్‌తో ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మన బౌలర్లు తేలిపోయారు. స్పి న్నర్లు రాణించినా లంక జోరును అడ్డుకోలేకపోయారు. ఫలితంగా మొదటిరోజే లంక ఎలెవన్ భారీస్కోరు సాధించింది.
టాస్ గెలిచిన శ్రీలంక ఎలెవన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ముందురోజు నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ శుభమన్ గిల్‌కు టీమ్ మేనేజ్ మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో కెఎల్ రాహుల్ సా రథ్యం వహించాడు. తొలిరోజు ఆటలో గిల్ దిగడని, మెడికల్ టీమ్ అతని గాయాన్ని పర్యవేక్షిస్తోందని బీసీసీఐ తెలిపింది. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో లంక ఎలెవన్ బ్యాటర్లు స్వేఛ్ఛగా ఆడారు. తొలి వికెట్ కు 20 ఓవర్లలోనే 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ క్రమంలో నిశాంత్ మధుష్క, రవిందు హాఫ్ సెంచరీలు సాధించారు. నిశాంత్ 66 పరుగుల దగ్గర రనౌట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత బ్యాటర్లు కూడా భారీస్కోర్లు సాధించకున్నా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. రెండో వికెట్ కు సూరియబండార, రవిందు 61 పరుగులు జోడంచారు. రవిందు (71), సూర్యబండార (35), రత్నాయకే (39), విక్రమ్ సింఘే (31) పరుగుల తో రాణించారు. తర్వాత కెప్టెన్ సోనాల్ ది నుష హాఫ్ సెంచరీ చేయగా, రమేష్ మెండి స్ 32 పరుగులతో సహకారమందించాడు.
దీంతో శ్రీలంక ఎలెవన్ స్కోరు దూకుడుగా నే సాగింది. మూడో సెషన్‌లో భారత స్పిన్న ర్లు పుంజుకోవడంతో లంక ఎలెవన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి లంక ఎలెవన్ 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. నువాంత (9), సుధీర (1) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
పెద్దగా అనుభవం లేని లంక బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. స్పిన్న ర్లు పుంజుకోకుంటే మాత్రం ఆ జట్టు మరిం త భారీస్కోరు చేసేది. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, సారంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయారు. అటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడే జా, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు పడగొట్టగా, గుర్నూర్ బ్రార్ 1 వికెట్ తీసాడు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా రూపొందించడంపై ఇప్పటికే భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
స్కోరు బోర్డు
లంక ఎలెవన్ : 363/8 ( నిశాన్ 66, రవిందు 71, సూరియబండార 35, రత్నాయకే 39, దినుష 52; కుల్దీప్ యాదవ్ 2/76, జడేజా 2/64, మానవ్ సుతార్ 2/33, బ్రార్ 1/49 )






