8 August, 2026 | 1:51 AM

యువ జోష్.. ఎమ్మెల్సీ రేస్!

08-08-2026 01:02 AM
  1. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై యువనేతల ఫోకస్
  2. కాంగ్రెస్‌లో టికెట్ కోసం పెరుగుతున్న పోటీ
  3. రెండు నియోజకవర్గాల్లో డజన్ మందికి పైగా ఆశావహులు 
  4. మార్చిలో ముగియనున్న తీన్మార్ మల్లన్న, వాణిదేవి పదవీకాలం 
  5. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ 
  6. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల సమీక్షలు
  7. పట్టభద్రుల ఓటరు నమోదుపై దిశానిర్దేశం  

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైంది. ము ఖ్యంగా అధికార కాంగ్రెస్‌లో నేతల హడావుడి పెరిగింది. అయితే ఈసారి ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు యువ నాయకత్వం పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతోంది. పదవుల కో సం ఎదురుచూస్తున్న యువ నేతలు గ్రాడ్యుయేట్ ఎన్నికలను తమ రాజకీయ భవిష్య త్తుకు వేదికగా భావిస్తున్నారు. దీంతో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

వచ్చే ఏడాది మార్చిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ని యోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి సురభి వాణిదేవి, తీన్మార్ మల్లన్న ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి పదవీకాలం ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించి కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో హడావుడి మొదలైంది. టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టారు. 

గతానికి భిన్నంగా..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. అయితే ఏ ఎన్నికలు వచ్చినా టికెట్ కోసం ఎక్కువగా సీనియర్ నేతలే పో టీపడటం సహజంగా ఉండేది. కానీ, ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకు భిన్నంగా అంతా యువ నాయకులే రేస్‌లోకి వస్తున్నారు. మరోవైపు ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చ జరిగింది.

రెండు గ్రాడ్యుయేట్ స్థానాలను గెలిచి తీరాల్సిందేనని  ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఆదేశించింది. సామాజిక సమీకరణాలు ఎ లా ఉన్నా అంతిమంగా గెలుపే ముఖ్యమని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఆయా స్థానాలకు ఇన్‌చార్జ్ మంత్రులను ప్రకటించే దిశగా టీపీసీసీ కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించా ల ని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న కాంగ్రె స్ మద్దతుతో విజయం సాధించగా, వాణిదేవి బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచి గెలు పొందిన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్‌లో ఫుల్ డిమాండ్   

-మహబూబ్‌నగర్- హైదరాబాద్- రం గారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య భారీగానే ఉం ది. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఉపాధ్యాయ సంఘం నేత హర్ష వర్ధన్ రెడ్డి, ఓ పారిశ్రామిక వేత్త కుటుంబానికి చెందిన మన్నే జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ మీడి యా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత గౌరీ సతీష్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్సీ టికెట్ రేసులో ఉన్నారు.

నల్గొండ-- ఖమ్మం-- వరంగల్ స్థానానికి కూడా డి మాండ్ అధికంగానే ఉంది. మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఆశావహుల సం ఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంలో కీలక నాయకులు అంతా ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. ఈ సీటుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అయితే అమిత్‌రెడ్డి పేరుపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పంది స్తారన్నది కీలకంగా మారింది. పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జీ సింగాపురం ఇం దిర పేర్లు కూడా తెరపైకి  వస్తున్నాయి. అలాగే ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కీలకమైన నాయకులు ఇంకెవరి పేర్లు ప్రతిపాదిస్తారన్నది కూడా చర్చనీయంశంగా మా రింది. అయితే రెండు పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి పోటీ చేసేందుకు చాలా మం ది ముందుకు వస్తున్నా.. ఆయా జిల్లాలకు చెందిన సీనియర్  నేతల ఆలోచన ఏంటో ఇంకా బయటికి రాలేదు.

ప్రధానంగా ము ఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ నిర్ణయం కీలకంగా మారనుం ది. అభ్యర్థుల కోసం త్వరలోనే పార్టీప రంగా అభిప్రాయ సేకరణ కూడా మొదలవుతుందని, అప్పుడు మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలు ఇప్పటి నుంచే రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి.