ఏడాది బాలుడి కిడ్నీలో పెద్ద రాయి
శస్త్రచికిత్స లేకుండా తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): సాధారణంగా పెద్దవారిలో కనిపించే కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు పసిపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఏడాది వయసున్న బాలుడికి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి కోత లేకుండా కిడ్నీలోని 10 మిమీ రాయిని తొలగించి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అద్భుత విజయాన్ని సాధించారు.
కేసు వివరాలు: బీదర్‌కు చెందిన ఒక ఏడాది బాలుడు విపరీతమైన ఏడుపు, మూ త్రంలో రక్తం పడటం వంటి లక్షణాలతో బా ధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో బాలు డి ఎడమ కిడ్నీలో 10 మిమీ పరిమాణం ఉన్న రాయి ఉన్నట్లు తేలింది. తదుపరి చికి త్స కోసం బాలుడిని హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అధునాతన చికిత్స ‘ఈఎస్‌డబ్ల్యూఎల్’:
బాలుడు చాలా చిన్నవాడు కావడం, సా ధారణ సర్జరీ వల్ల కలిగే ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యాధునిక ఎక్స్‌ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూ ఎల్) పద్ధతిని ఎంచుకుంది.
కోతలేని వైద్యం: ఈ పద్ధతిలో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కేవలం ‘లిథో ట్రిప్టర్’ యంత్రాన్ని ఉపయోగించి హై-ఎనర్జీ షాక్ వేవ్స్ ద్వారా రాయిని ఇసుక రేణువులంత చిన్న ముక్కలుగా పొడి చేశారు.
సురక్షితం: అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగించడం వల్ల బాలుడికి రేడియేషన్ ముప్పు కలగకుండా జాగ్రత్త పడ్డారు.
వేగవంతమైన కోలుకోలు: చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే బాలుడు మామూలు స్థితికి వచ్చి పాలు తాగడం ప్రారంభించాడు. అదే రోజు డిశ్చార్జ్ కూడా చేశారు.
వైద్యుల వివరణ: ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ మాట్లాడుతూ.. ‘పిల్ల ల విషయంలో సర్జరీ వల్ల కలిగే గాయాన్ని తగ్గించడమే మా ప్రాధాన్యత. ఈ ఆధునిక పద్ధతి వల్ల ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా, అత్యంత సురక్షితంగా రాయిని తొల గించగలిగాం’, అని తెలిపారు. ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి. మాట్లాడుతూ ‘ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అల వాట్ల వల్ల చిన్నారుల్లో కూడా చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి పద్ధతులు వారి శరీర నిర్మాణానికి ఇబ్బంది కలిగించవచ్చు.
అటువంటి స మయాల్లో ఈఎస్‌డబ్ల్యూఎల్ అత్యంత ప్ర భావవంతమైన మార్గం’, అని పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షల్లో బాలుడి కిడ్నీలో రాయి పూర్తిగా తొలగిపోయిందని, అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉ న్నాడని వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ పూర్ణచంద్ర రెడ్డి, డాక్టర్ మల్లికార్జున సి, మిస్టర్ దేశ్‌పాండ్యా హేమేష్లతో కూడిన నిపుణుల బృందం ఈ చికిత్సలో పాలుపంచుకుంది.




