25 June, 2026 | 5:52 PM

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం

25-06-2026 05:03 PM

కలెక్టర్ అనురాగ్ జయంతి..

ఆలేరు, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్  ABDM అమలుకు మోడల్ జిల్లాగా ఎంపికైన యాదాద్రి భువనగిరిలో గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపైకి తెచ్చేందుకు ABDM ఉద్దేశమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫార్మసీలు, వైద్య నిపుణులందరూ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR), హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (HPR)లో తప్పనిసరిగా నమోదు కావాలని ఆదేశించారు.

ABHA IDతో లాభాలు  ప్రతి పౌరుడికి ABHA ID రూపొందించడం ద్వారా ఆరోగ్య రికార్డులు డిజిటల్‌గా అనుసంధానమవుతాయి. రోగి అనుమతితో ఏ ABDM-నమోదిత ఆసుపత్రిలోనైనా గత చరిత్ర, రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు చూసి వేగంగా చికిత్స అందించవచ్చు. అనుమతి లేకుండా వివరాలు చూడలేరు. సమావేశంలో DM&HO డాక్టర్ మనోహర్, జెడ్పీ సీఈఓ శోభరాణి, ABDM నోడల్ అధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్, స్టేట్ ట్రైనర్ సాయి కుమార్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.