28 August, 2026 | 2:03 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు.. జీవితం నాశనం చేసుకోవద్దు

25-06-2026 04:56 PM

డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై శ్రీనివాస్ గౌడ్

పాపన్నపేట,జూన్25: యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు. గురువారం పాపన్నపేటలో మత్తుపదార్థాల నిర్మూలనపై జూనియర్ కళాశాల విద్యార్థులతో కళాశాల నుండి గ్రామంలోని ప్రధాన రోడ్డు  వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. మెదక్ బొడ్మట్ పల్లి ప్రధాన రోడ్డుపై చౌరస్తా వద్ద డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం ఎస్సై శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు  మంచి అలవాట్లతో జీవిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. యువత, విద్యార్థులు చెడు వ్యవసనాల వైపు వెళ్లొద్దన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనించాలన్నారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, తదితర మత్తు పదార్థాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నర్సింలు, కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్ కుమార్, అధ్యాపకులు శ్రీనివాస్, రమేష్ తదితరులున్నారు.