25 June, 2026 | 5:59 PM

ఓటు నమోదు ప్రతి ఒక్కరి హక్కుగా భావించాలి: పోచారం

25-06-2026 04:50 PM

పోచారం గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ...  

ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపు... పారదర్శకంగా సవరణ పూర్తి చేయాలని సూచన...

అధికారుల వద్ద ఓటరు వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి...

బాన్సువాడ, జూన్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని రెవెన్యూ అధికారుల వద్ద తన ఓటరు వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.  

ఎమ్మెల్యే పోచారం తో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యుల ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో పాల్గొనాలని కోరారు. అర్హులైన వారందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.భారత ఎన్నికల సంఘo దేశ వ్యాప్తంగా ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగంగా మెదటి రోజు పోచారం సొంత గ్రామం పోచారంలో ఓటర్ సవరణ నమోదు చేసుకున్నాం అని ఆయన తెలిపారు.

నమోదు చేసుకున్న ఓట్లు అందరికి సమానం. దింట్లో తరతమ్యాలు ఎమీ ఉండవు. బూత్ లెవెల్ అధికారి ఇచ్చే ఫారం తీసుకోని బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారం తో అందరు ఓటర్ నమోదు చేసుకోవాలని కోరారు. SIR అనేది చాలా గొప్ప ప్రక్రియ అని, మన భారత దేశం ప్రజాస్వామ్యం దేశం చాలా గొప్ప దేశం మనది అని,ఎన్నికల సమయంలో ఓటు లేదు అంటే ఎం చేయలేమాని ఇప్పుడే అందరు చేసుకోవాలని కోరారు.అక్టోబర్ ఒకటో తారీఖున తుది జాబితా విడుదల చేస్తారనీ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి పైసిల్దార్ రాజా నరేందర్ గౌడ్ గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.