సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలి
, అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంచాలి
మున్సిపల్ చైర్మన్ కొణతం. చిన్న వెంకట్ రెడ్డి.
నేరేడుచర్ల, జూన్ 25(విజయక్రాంతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులయిన జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన మందులు ,వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ చైర్మన్ కొణతం. చిన్న వెంకట్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.వర్షాకాలo నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు జాగ్రత్తలు మరియు సన్నద్ధత చర్యలపై హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది అంగన్వాడీ టీచర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణ, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గర్భిణీలు మరియు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై వార్డుల వారీగా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.ఈ నెల 28 న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉపయో గించుకోవాలని పట్టణ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన.నాగరాజు, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి,డాక్టర్ పి.నాగిని ,ఆయా వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మార్కెట్ వైస్ చైర్మన్,అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.






