గోండి భాష నేర్చుకుంటా.. ఆదివాసీ గోండుల కట్టుబాట్లను ఆదర్శంగా తీసుకుంటా..
* అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం..
* రిమ్మ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
* ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం..
* లైబ్రరీకి రూ.10 లక్షల మంజూరు
* రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు..
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదివాసీల ఆచార సంప్రదాయాలు దేశానికి ఆదర్శమని, గోండి భాషను నేర్చుకుంటానని, ఆదివాసి గోండుల సంస్కృతి సాంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకుంటానని ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో పర్యటించిన ఆయన నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిమ్మ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం 75 వేల రూపాయల వడ్డీ చెల్లిస్తుందని గుర్తు చేశారు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తూనే ఇంద్రమ్మ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే పేద ప్రజలకు అందిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ గూడానికి వెళ్లిన ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుందని గుర్తు చేశారు. త్వరలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామని, ఒంటరి మహిళలకు సైతం మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు.
రిమ్మ గ్రామంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రతిపాదనల మేరకు పైలట్ గ్రామంగా ఎంపిక చేసి ఒక్క 152 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆదివాసీ గిరిజనులు అనవసరపు ఖర్చులకు వెళ్లకుండా పిల్లలను చదివించాలని సూచనలు చేశారు. గ్రామస్తుల విన్నపం మేరకు రిమ్మ గ్రామంలో 10 లక్షలతో గ్రంథాలయమును ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించడంతోపాటు తన పర్యటక శాఖ తరపున 10 లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలను అందచేస్తామని అన్నారు.
ఆదివాసి గిరిజనుల గూడాల ప్రజల కట్టుబాట్లు , ఆచార వ్యవహారాలు రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు మరోసారి రిమ్మ గ్రామానికి వస్తానని , ఒకరోజు దినమంత ఉండి ఆదివాసుల కట్టుబాట్లను పటేల్ పనితీరును పరిశీలించి నేర్చుకుంటానని గిరిజనులు కామ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గం లోకి సిరికొండ మండలంలోని 10 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఈ గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలంటే అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ మారుమూల గ్రామాల్లో పోడు వ్యవసాయం చేసుకొని గిరిజనులు జీవిస్తున్నారని , ఈ ప్రాంత రైతులకు సాగు నీటితోపాటు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఉందని అన్నారు. చీక్ మాన్ ప్రాజెక్టు నీరు ఈ ప్రాంత రైతులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.






