మహిళ సంఘాల చేతికి 'సోలార్ పవర్'
*మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
*ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు శనివారం. నియోజకవర్గ కేంద్రంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు చిన్న, చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సోలార్ ప్లాంట్ లు, పెట్రోల్ బంకులు మహిళా సంఘాలకు కేటాయించామన్నారు.
ఈ సోలార్ పవర్ ప్లాంట్ లు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, అనుమతులు, మరియు పెట్టుబడికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందజేశమన్నారు, పవర్ ప్లాంట్ వల్ల వచ్చే ఆదాయం నేరుగా మహిళా సంఘాల సభ్యులకే చేరుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మొదటి సంతకం మహాలక్ష్మి పథకం అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని గుర్తు చేశారు.
మహిళా స్వయం సంఘాల కోసం వడ్డీ లేని రుణాలను పెద్ద ఎత్తున అందజేస్తున్నామన్నారు, అంతేకాక మహిళా సంఘం సభ్యురాలికి పది లక్షల బీమా సౌకర్యం కల్పించామన్నారు. మహిళాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరు మీదనే అమలు చేస్తుందని తెలిపారు.
ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహాలక్ష్మి పథకం, సోలార్ పవర్ ప్లాంట్‌లు, పెట్రోల్ బంక్ లు, మహిళలకు వడ్డీ లేని ఋణాలు, ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు అందజేశామన్నారు. దీనివల్ల మహిళల ఆదాయం పెరిగి, వారి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడి, మహిళలు ఆర్థిక స్వాలంబన సాధిస్తారని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.






