06-02-2026 12:16:47 AM
సుల్తానాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురా లు యువ మహిళా న్యాయవాది స్వప్న ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పె ద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి అన్నా రు. ఈ దారుణ హత్యకు నిరసనగా గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.
న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు హేయమైన చర్య అని, వారి రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొయిని భూమయ్య , న్యాయవాదులు భూసారపు బాల కిషన్ ప్రసాద్, మాడూరి ఆంజనేయు లు, పడాల శ్రీరాములు, ఆకారపు సరోత్తం రెడ్డి, జోగుల రమేష్, చిలుక ఆనంద్, వంగళ యుగేందర్ రెడ్డి, వేముల స్నేహ తదితరులు పాల్గొన్నారు.