calender_icon.png 6 February, 2026 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యపై కాంగ్రెస్ నిర్లక్ష్యం

06-02-2026 12:15:49 AM

కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇది ‘రైసింగ్ తెలంగాణ కాదు... ఫాలింగ్ తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.

విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బాలల హక్కుల పరిరక్షణ వేదిక(--తెలంగాణ) ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మా ట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలపై ప్రభు త్వం వెచ్చించే ఖర్చులను వ్యయంగా చూడకూడదని, అవి రాష్ట్ర భవిష్యత్‌కు పెట్టుబ డులుగా భావించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అవసర మైన నిధులు లేకుండా పోయా యని, మరోవైపు ప్రైవేటు పాఠశాలలపై ఎలాంటి నియం త్రణ లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విద్యారంగం గందరగోళ స్థితికి చేరుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రజాపా లన, పారదర్శకత కేవలం మాటలకే పరిమితమైందని, హామీలు నెరవేర్చకుండా దాటవే త ధోరణిని అవలంబిస్తోందని విమర్శించా రు. ప్రభుత్వానికి నిజాయితీ లేదని, అందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆయన ఆరోపించారు.

నిజాయితీ లేకపోవడం, నిధుల కొర త, నియంత్రణ లేకపోవడం కలిసి విద్యారంగంలో విచ్చలవిడిత నానికి దారితీస్తున్నాయని అన్నారు. మార్పు అని చెప్పే కాంగ్రెస్ నాయకులు, ఆ మార్పు నకు తగిన విధంగా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు సమయం ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క విద్యా విధానం కూడా రూపొందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.