23 April, 2026 | 1:25 AM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

23-04-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య 

మొయినాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మొయినాబాద్ మండల పరిధిలో ని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్ ఏర్పాటు అభివృద్ధి పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. మోత్కుపల్లి గ్రామంలో 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు, 5 లక్షలతో స్ట్రీట్ లైట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బాకారం జాగీర్ గ్రామంలో 40 లక్షల నిధులతో సీసీ రోడ్లు, 5 లక్షలతో స్ట్రీట్ లైట్, ఖాసీంబౌలి గ్రామంలో 30 లక్షల నిధులతో సీసీ రోడ్లు, 5 లక్షలతో స్ట్రీట్ లైట్, నక్కలపల్లి గ్రామంలో 50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, 5 లక్షలతో స్ట్రీట్ లైట్లు, కనకమామిడి గ్రామంలో 2 కోట్ల 45 లక్షల నిధులతో సీసీ రోడ్లు, 5 లక్షలతో స్ట్రీట్ లైట్ అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల సర్పంచ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. మనందరం కలిసి గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో  ముందుకు తీసుకువెళ్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యు లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.