25 May, 2026 | 7:53 AM

ఎల్బీనగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా

17-06-2024 12:25 AM

ఎంపీ ఈటల రాజేందర్

ఎల్బీనగర్, జూన్ 16 : నిత్యం ప్రజా సేవ కుడిగా పని చేస్తానని, ఎల్బీనగర్ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మల్కా జిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చా రు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలోని అన్ని నియోజకవర్గాల్లో కెల్లా ఎల్బీనగర్ ఓటర్లు అధిక మెజార్టీ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, కొత్తపేట కార్పొరేట ర్ పవన్ కుమార్, హయత్‌నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన కృతజ్ఞత సమావేశాలకు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.