1 August, 2026 | 6:58 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

17-06-2024 12:25 AM

యాదాద్రి భువనగిరి, జూన్ 16 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన రాయిగిరిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన మామిడి సాయికుమార్ ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయికుమార్ మోటార్‌బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా రాయిగిరి వద్ద వాహనాన్ని తొర్రూరు నుంచి జగద్గిరిగుట్లకు వెళ్తు న్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో  సాయికుమార్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిపై భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.