హుస్నాబాద్‌ను రోల్‌మోడల్ చేస్తా..
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, జూన్ 16: అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా నిలుపుతానని రాష్ట్ర రవాణా, బీసీ సం క్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పలుచోట్ల ప్రజాదర్బార్ నిర్వహించారు. చిగురుమామిడి, వై.సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలా ల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చినందున అధికారులు పారిశుధ్య చర్యలను విస్తృతంగా చేపట్టాలన్నారు. తిరిగి ఈ 21న నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రజలకు తనకు స్థానిక సమస్యలను నివేదించవచ్చన్నారు. పర్యటనలో వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.






