calender_icon.png 9 February, 2026 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురికివాడల్లో ముసురుకున్న నాయకులు

09-02-2026 12:00:00 AM

  1. దుర్గంధ భరితమైన గల్లీలో మురుగు కాలువలు 

చెత్తకుప్పలు దాటుతూ కొనసాగుతున్న ప్రచారం

నిజామాబాద్ ఫిబ్రవరి 08 (విజయ క్రాంతి):  మురికివాడాల వైపు వెళ్లాలంటేనే ముఖం చాటేసే నాయకులు మురికి మురికివాడల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు దుర్గంధ భరితమైన వీధుల్లో సైతం తిరుగుతూ ఎదురుగా వచ్చిన స్థానిక నాయకుల ను  ఆప్యాయంగా పలకరిస్తున్నారు.  పురపాలక ఎన్నికలు కావడంతో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. వాడల్లోని పిల్లలను ఆప్యాయంగా ఎత్తుకొని ముద్దడుతున్నారు.

మురికికాలువలు చెత్తాచెదారాన్ని దాటుతూ వారి ప్రచారం కొనసాగుతోంది. నిజామాబాద్ నగరంలోని  గరంలోని కెనాల్ కట్ట గౌతమ్ నగర్ దుబ్బ అర్సపల్లి పులాంగ్ గాజులపేట్ మిర్చి కాంపౌండ్ తమ లలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ మురికివాడల్లో  ఉదయాన్నే కూలి పనికి వెళ్లే వాళ్ళు ఉండడంతో తెల్లవారులు మొదలుకొని తమ ప్రచారాలను కొనసాగిస్తు న్నారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని స్లం ప్రాంతాలతో పాటు బోధన్ ఆర్మూర్ భీమ్గల్ మున్సిపాలిటీలలో ప్రచారం జోరుగా సాగుతోంది. మురికివాడలో ప్రచారం జరుగుతున్న ప్రాంతాల్లో వస్తున్న దుర్గందాన్ని భరిస్తూ ముక్కుల వద్ద చేతి రుమాలు అడ్డుపెట్టుకొని నాయకులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వాడల ప్రచారంలో ఎదురుగా వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ కరాచలనం చేస్తున్నారు.

అలా అలై బలై తీసుకుంటున్నారు. వారి పిల్లలను ఎత్తుకొని ముద్దాడుతున్నారు. తమ గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగుతున్న అభ్యర్థుల బాధలు వర్ణాతీతం. కొన్ని ప్రాంతాల్లో మురికివాడల ప్రజలు నిలదీస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో తమ ఓట్లకు సంబంధించి డిమాండ్  ను అభ్యర్థులకు స్థానికులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం పడకేయడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల తోపాటు పాతబస్తీ, ఎల్లమ్మ గుట్ట, బోధన్ రోడ్ బోధన్ రోడ్, నిజామాబాద్ నగర ప్రధాన కూడలి కోర్టు చౌరస్తా వద్ద మురికి నీరు నిల్వ ఉంటున్నాయి.

చిన్నపాటి వర్షాల కే డ్రైనేజీలు పొంగి పొరలు తుండడంతో మురుగు నీరు అంత రోడ్లపై చేరి దుర్గం వ్యాపిస్తోంది. తరచుగా డ్రైనేజ్ కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు తాత్కాలికంగా బల్దియా చర్యలు చేసినప్పటికిని శాశ్వత పరిష్కారం చేయాలేకపోతున్నారు. ముఖ్యంగా దోమల నివారణలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందనే చెప్పవచ్చు. ఈ దోమల వల్ల సంఖ్యలో ప్రజలు డెంగ్యూ బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర అనారోగ్యం పాలై కోలు కుంటున్నారు.

ఇంటి పరిసరాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఉప వైద్యురాలు సూచించారు. ఆరోగ్య కేంద్రాలలో డెంగ్యూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు .నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దుబ్బ లేబర్ కాలనీ అరుంధతి నగర్ గౌతమ్ నగర్ శాస్త్రి నగర్ వంటి మురికివాడలో పాతబస్తీ ప్రాంతాలలో పారిశుధ్యం డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో పందుల సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రజలకు పలు వ్యాధుల సంక్రమిస్తున్నాయి .

పాతబస్తీ ప్రాంతాల్లో పారిశుద్ధం డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సెప్టిక్ ట్యాంకులు పొంగిపొర్లడం వంటి ఇబ్బందులు తీవ్రమవడంతో స్థానిక ప్రజలు దుర్గంధం భరించలేకపోతున్నారు. గతంలో నిజామాబాద్ నగరం లో గల అటవీశాఖ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న మారుతి, పూజ  ల చిన్నారి అనన్య సమీప డ్రైనేజీ కాలువలో పడి కొట్టుకుపోయి మృతి చెందింది ఈ సంఘటన స్థానికుల ను కంటతడి పెట్టించింది.               

నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ఒక నగరం 2016 అక్టోబర్ 11న జరిగిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాద్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది (3) రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన మూడవ అతిపెద్ద నగరమైన నిజామాబాద్ పురపాలక సంస్థ పాలించబడుతుండడంతో ఇది నిజామాబాద్ జిల్లా ప్రధాన నగరం గా మారింది నిజామాబాద్ జిల్లా గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైనప్పటికీ నిజామాబాద్ ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భాగమయ్యింది.