calender_icon.png 9 February, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు నేతకు కన్నీటి వీడ్కోలు

09-02-2026 12:00:00 AM

అంత్యక్రియలో పాల్గొన్న గ్రామస్తులు, పౌర హక్కుల నేతలు

కామారెడ్డి, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు లోకోటి చందర్ అలియాస్ పడకల్ స్వామి అలియాస్ ప్రభాకర్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన కామారెడ్డి మండలం ఇస్రో జివాడి గ్రామంలో నిర్వహించారు. పౌర హక్కుల  నేతలు హాజరై అతని మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. మావోయిస్టు నేతకు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలకగా పౌర హక్కుల  నేతలు స్వామి  అమర్ హై అంటూ నివాళులు అర్పించారు.

కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకోటి చందర్రావు అలియాస్ ప్రభాకర్ అలియాస్ పడకల్ స్వామి ఇటీవల మహారాష్ట్రలోని గడ్చి రోలి లో జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాపారు.  దశాబ్దాల కాలం పాటు బానిసత్వానికి గురై   పీడించబడుతున్న ప్రజల పక్షాన నిలబడి విప్లవ వీరుడు నేలకొరగడం తో ఇస్రోజి వాడి గ్రామం కన్నీటి సంద్రంగా మారింది.  

బూటకపు ఎన్కౌంటర్‌లపై విచారణ జరిపించాలి 

మావోయిస్టు నేత లో కోటి చందర్రావు అలియాస్ పడకల్ స్వామి అలియాస్ ప్రభాకర్ అంత్యక్రియల హాజరైన పౌర హక్కులనేతలు ఆయన మృతదేవానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. ఎన్కౌంటర్ల పేరిట పోలీసులు చేస్తున్న మావోయిస్టుల హత్యలేనని ఇవి ప్రభుత్వ మూ చేస్తున్న హత్యలేనని అన్నారు.

బూటకపు ఎన్కౌంటర్లపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేస్తారని  గద్దెనెక్కిస్తే ఎన్కౌంటర్ పేరిట హత్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. స్వామి అంత్యక్రియలకు వివిధ జిల్లాలకు చెందిన పౌర హక్కుల నేతలు హాజరై నివాళులర్పించారు. 

కుమారుడే శవాన్ని తీసుకువచ్చారు 

మావోయిస్టు నేత లో కోటి చందర్రావు అలియాస్ పడకల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మృతదేహాన్ని ఆయన కుమారుడు రమేష్ తమ బంధువులతో కలిసి వెళ్లి మహారాష్ట్రలోని గడ్చిరోలి కి శనివారం వెళ్లి ఆదివారం మృతదేయాన్ని తీసుకోవచ్చారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పేద ప్రజల కోసం పోరాడిన నేత నేలకొరిగాడంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

అంతేక్రియాలలో వివిధ గ్రామాల ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుంచి పౌర హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ రావు, కార్యదర్శి కుమార్ స్వామి మరియు విప్లవ రచయితల సంఘం కార్యదర్శి పాణి తదితరులు హాజరయ్యారు. కరీంనగర్, జమ్మి కుంట, వికారాబాద్, నిజామాబాద్, సిర్నాపలి, ముద్దికుంట, , సిరిసిల్ల, సిరికొండ, హైదరాబాద్, కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు,  స్వామి అభిమానులు,.. ప్రజా సంఘాలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మాస్ లైన్) విద్యార్థినిలు..