calender_icon.png 9 February, 2026 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ జానకి

09-02-2026 12:00:00 AM

నిర్మల్, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): ఎన్నికల సమయం మొదలు కొని ఫలితాలు వెల్లడించే వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అంతటా ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎలక్షన్ సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందని, అన్ని పోలింగ్ కేంద్రాలు కీలక ప్రాంతాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కూడా కోల్పోయే అవకాశముందని హెచ్చరించారు.