పదవుల వేటలో నేతలు
ప్రజల్లోకి వెళ్లాల్సింది పోయి...
పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు
ప్రతిపక్ష పార్టీ విమర్శలను... దీటుగా తిప్పుకొట్టడంలో నేతలు విఫలం
నియోజకవర్గంలో వందల కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్న...
క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలో స్థానిక నేతలు ఫెయిల్
ఆమనగల్లు, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ(Kalwakurthy Constituency) అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలోనే ప్రభుత్వం భర్తీ చేయనున్న వివిధ కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు, కాలపరిమితి ముగిసిన పదవుల పొడిగింపు (ఎక్స్టెన్షన్) కోసం స్థానిక నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామాలు, మండలాల్లో పార్టీని బలోపేతం చేయడం పక్కనబెట్టి, పదవుల సాధనే ధ్యేయంగా ఎంపీ, ఎమ్మెల్యే, పార్టీ ఇ న్ఛార్జ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ప్రలోభాలు.. మర్యాదపూర్వక ‘గిఫ్టులు’..
రాబోయే పదవులను దక్కించుకునేందు కు కల్వకుర్తి నియోజకవర్గం చెం దిన పలువురు నేతలు పండగలు, ప్రత్యేక సందర్భాలను పు రస్కరించుకుని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే పనిలో పడ్డారు. పెద్దల మద్దతు పొందేందుకు మర్యాదపూర్వక భేటీల పేరుతో ప్రత్యేకమైన గిఫ్టులు ఇ స్తూ, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ తీరుపై స్వయంగా సొం త పార్టీ నాయకులే సెటైర్లు వేస్తుండటం గ మనార్హం. ‘నేతలకు పార్టీకి సేవ చేయడం కం టే, పెద్దలను ఎలా ప్రలోభ పెట్టాలనే దానిపైనే శ్రద్ధ ఎక్కువైంది‘ అని సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రతిపక్ష దాడి.. అధికార పార్టీ మౌనం
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం తాండ్ర- కొండారెడ్డిపల్లి ఎక్స్ రో డ్డు వద్ద స్థానిక రైతులు కరెంటు కోతలను నిరసిస్తూ... రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వెళ్లి బుచ్చారు. ఆ ప్రకటితకరెంట్ కోతలను నిలిపివేస్తూ రైతులను ఆదుకోవాలని వారు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీ బీ ఆర్ ఎస్ నేతలు కల్వకుర్తి, కడ్తాల్, వెల్దండ మండలాల్లో... ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ’ఆరు గ్యారెంటీలు విఫలమయ్యా యి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమ లు కావడం లేదు’ అంటూ నిరసనలు, పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.
అయితే, ప్ర తిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విఫలమవుతున్నారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. కేవలం ఎమ్మెల్యే పాల్గొనే సభలు, సమావేశాలు సం దర్భంలోనే...స్థానిక నేతలు పాల్గొని ఆయన పక్కన కూర్చోవాడానికే మాత్రమే పోటీ ప డుతున్నారు.. తప్ప మిగతా సందర్భంలో ఎక్కడ ప్రతిపక్ష పార్టీ నేతలు... ప్రభుత్వం, సీ ఎం, ఎమ్మెల్యేలపై చేస్తున్న ఆరోపణల తీరును ఎండగట్టడంలో వెనుకబడి పోతున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రెస్ మీట్లకే పరిమితం
ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ళు,బీటి రోడ్లు, నూతన ప్రభుత్వ దావఖానాల నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్ స్కూ ల్, అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీలు, అభివృ ద్ధి నిధులకు మంజూరైన నిధులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతలు శ్రద్ధ చూపడం లేదని పార్టీ నిష్ఠావంతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కేవలం పేపర్ ప్రకటనలు, ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ప్రజలకు నిజాలను వివరించడం లేదు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు దీటైన సమాధానం చెప్పలేకపోవడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయిందనే అభిప్రాయంవ్యక్తమవుతోంది. పదవుల పరుగు పందెం పక్కనబెట్టి, ఇకనై నా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టాలని కల్వకుర్తి కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి.