కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు
మేడ్చల్ అర్బన్, మార్చి 19 (విజయక్రాంతి): గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి వర్యులు సిరిసిల్ల బీఆర్‌ఎస్ పార్టి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామరావును మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చై ర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు చెప్పారు. తనను కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన భాస్కర్ యాద వ్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులు
చేవెళ్ళ మార్చి 19 (విజయక్రాంతి): ముడిమ్యాల గ్రామంలో రామాలయం వద్ద ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులు గ్రామ పెద్దలు గురువారం పరిశీలించారు. ఉగాది సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌడ్ చర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, సర్పంచుల సం ఘం మాజీ మండల అధ్యక్షుడు పడాల ప్రభాకర్, సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ జంగారెడ్డి, వార్డు సభ్యులు పనులు పర్యవేక్షించారు. అనంతరం గ్రామ పెద్దలు షడ్రుచుల పచ్చడ పానీయం సేవించారు.
గ్రామ ప్రజలుకు ఉగాది షడ్రుచుల సంతో షం చేకూరి సుఖశాంతులతో చల్లగా ఉండాలని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు శేరి రాజు, ఊరడి రాములు, గోనె విశాల్ రెడ్డి, యంజాల మల్లేష్, గుండాల నర్సిములు, ఊరడి సత్తయ్య, ప్రవీణ్, మాణిక్యం , చాకలి గోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోలీసులకు ఉగాది శుభాకాంక్షలు
కందుకూరు, మార్చి 19 : మతసామరస్యానికి ప్రతీకగా కందుకూరు మండల ముస్లిం మైనారిటీలు నిలిచారు. గురువారం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్త్స్రలు పరమేష్, మహేందర్ మరియు ఇతర సిబ్బందికి మైనారిటీ సోదరులు ప్రత్యేకంగా కలసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేడు జరుపుకొనే ఈదుల్ ఫితర్ (రంజాన్) ప్రార్థనల నేపథ్యంలో, మండలంలోని ప్రధాన ఈద్గాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు పోలీసులను కోరారు.
దీనికి స్పందించిన సీఐ.. కందుకూరు, నేదునూరు, దాసర్లపల్లి, పులిమా మిడి, కొత్తగూడ వంటి గ్రామాల్లో ఉదయం 8 గంటలకే పోలీస్ బందోబస్తు సిద్ధం చేస్తామని, ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మైనారిటీ సంఘం ఉపాధ్యక్షులు అఫ్జల్ బేగ్, ప్రధాన కార్యదర్శి ఖాజా మొయినొద్దీన్, రఫీక్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.




